Sunday 8 August 2010

దత్త పది


ఆర్యులారా!
ఒకసారి ఆకాశవాణిలో ఇచ్చిన సమస్య క్రింది విధంగా ఉంది. పూరించే ప్రయత్నం చేయండి.

కోడి, పాడి, వేడి, తోడి.
(శీతా కాలంలో సామాన్యుడి పాట్లు వర్ణిస్తూ వ్రాయాలి.)


2 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

కోడి వరడ పాలాయెను.
పాడిపశువు వట్టి పోయె; వణికించు చలిన్
వేడిని కలిగించెడు చెలి
తోడిట నాకున్నఁ; దొలగఁద్రోయగ లేనా?

సుమిత్ర said...

మీ పూరణ చాలా బాగుంది.ఈ దత్తపదికి నా పూరణ-

"కోడిగమాడలేడు తన కోర్కెలు తీరగ నెల్ల కాలమున్
పాడిగ ప్రాప్తమైన సముపార్జిత విత్తము చాలి చాలకన్
వేడిమి పొందునా మనము వేదన చెందగ,యీతిబాధలన్
తోడిన హెచ్చునట్టి పరితాపము చాలదె శీతకాలమున్."