Friday 9 July 2010

సమస్యాపూరణ౦ - 4


ఆర్యులారా! ఈ రోజు నేనిస్తున్న సమస్య.....

"ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే"

పూరించి ప్రోత్సహించగలరు.

4 comments:

కంది శంకరయ్య said...

సూటిగ బాణము వలెఁ దా
న్వాటముగా పరుగు తీసి ప్రథముండయ్యున్
ఔటయె డోపింగ్ టెస్టున
ఓటమి గెలుపే యగునిక; ఓడును గెలుపే.

చింతా రామ కృష్ణా రావు. said...

ఓటమిగెలుపులఁ గన నే
నాటికి మన చేత లేదు.నారాయణుడే
ఓటమి గెలుపుగఁ చేసిన;
ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే

జిగురు సత్యనారాయణ said...

ఓటుకు ఈవీయమ్మై
ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే
ఫేటును మార్చెడి యంత్రము
ఘాటుగ వలదని పలికిరి ఘన నేతలికన్!!

ఈవీయమ్ము = EVM (Electronic Voting Machine)

సుమిత్ర said...

శంకరయ్యగారు, రామకృష్ణారావుగారు, సత్యనారాయణగారు,
పూరణలు బాగున్నాయండి. అభినందనలు.
నా పూరణ....

ఆటయే జీవనమ౦తయు
మాటల చదరంగమందు మమతలు పొ౦దన్
నాటకమై తోచునపుడు
ఓటమి గెలుపే యగునిక; ఓడును గెలుపే.