చిత్ర విచిత్ర పూరణల బ్లాగులోనికి సాదరముగా ఆహ్వానము పలుకుతూ . . . . .
సూటిగ బాణము వలెఁ దాన్వాటముగా పరుగు తీసి ప్రథముండయ్యున్ఔటయె డోపింగ్ టెస్టునఓటమి గెలుపే యగునిక; ఓడును గెలుపే.
ఓటమిగెలుపులఁ గన నేనాటికి మన చేత లేదు.నారాయణుడేఓటమి గెలుపుగఁ చేసిన;ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే
ఓటుకు ఈవీయమ్మై ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపేఫేటును మార్చెడి యంత్రము ఘాటుగ వలదని పలికిరి ఘన నేతలికన్!!ఈవీయమ్ము = EVM (Electronic Voting Machine)
శంకరయ్యగారు, రామకృష్ణారావుగారు, సత్యనారాయణగారు,పూరణలు బాగున్నాయండి. అభినందనలు.నా పూరణ.... ఆటయే జీవనమ౦తయుమాటల చదరంగమందు మమతలు పొ౦దన్ నాటకమై తోచునపుడుఓటమి గెలుపే యగునిక; ఓడును గెలుపే.
Post a Comment
4 comments:
సూటిగ బాణము వలెఁ దా
న్వాటముగా పరుగు తీసి ప్రథముండయ్యున్
ఔటయె డోపింగ్ టెస్టున
ఓటమి గెలుపే యగునిక; ఓడును గెలుపే.
ఓటమిగెలుపులఁ గన నే
నాటికి మన చేత లేదు.నారాయణుడే
ఓటమి గెలుపుగఁ చేసిన;
ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే
ఓటుకు ఈవీయమ్మై
ఓటమి గెలుపే యగునిక, ఓడును గెలుపే
ఫేటును మార్చెడి యంత్రము
ఘాటుగ వలదని పలికిరి ఘన నేతలికన్!!
ఈవీయమ్ము = EVM (Electronic Voting Machine)
శంకరయ్యగారు, రామకృష్ణారావుగారు, సత్యనారాయణగారు,
పూరణలు బాగున్నాయండి. అభినందనలు.
నా పూరణ....
ఆటయే జీవనమ౦తయు
మాటల చదరంగమందు మమతలు పొ౦దన్
నాటకమై తోచునపుడు
ఓటమి గెలుపే యగునిక; ఓడును గెలుపే.
Post a Comment