Tuesday 15 June 2010

సమస్యాపూరణం 1

సాహితీ ప్రియులారా!

అందరికీ నా బ్లాగులోనికి స్వాగతం. నేనిస్తున్న "సమస్య"లను పూరించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

సమస్య: అరిషడ్వర్గములతోడ అందెను ముక్తిన్

6 comments:

జిగురు సత్యనారాయణ said...

కరికి మకరి పీడ కలిగె
అరిషడ్వర్గములతోడ, అందెను ముక్తిన్
పరమాత్ముని వేడుకొనిన,
వరదాయిని నమ్మిన మరి వగపు కలుగునే!!

సుమిత్ర said...

@ సత్యనారాయణగారు, నా బ్లాగులోకి హృదయపూర్వక స్వాగతం.
మీ పూరణ సహజ సుందరంగా ఉంది. ధన్యవాదములు.
మీ ఆదరణ నిరంతరం ఇలాగే కొనసాగించగలరని కోరుతున్నాను.

కంది శంకరయ్య said...

చిరకాలఁపు సంసారఁపు
చెర వీడి యొకండు గురుని శిష్యుండయ్యెన్
గురుబోధ చేసె శత్రువు
నరిషడ్వర్గముల తోడ; నందెను ముక్తిన్.

సుమిత్ర said...

@ కంది శంకరయ్య గారు:
నా బ్లాగులోకి మిమ్ములను సాదరముగా ఆహ్వానిస్తున్నాను. గురు బోధ చేసి చక్కగా పూరించారు. ధన్యవాదములు.

సుమిత్ర said...

ఈ సమస్యకు నా యొక్క పూరణ.

హరినే చేరెడు కామము
మురిపించగ మదమత్సర మోహమ్ములతో,
మీరిన భక్త్యావేశపు,
అరిషడ్వర్గములతోడ అందెను ముక్తిన్

కంది శంకరయ్య said...

"సుమిత్ర" గారూ,
భావం కొంచెం తికమక పెట్టినా పద్యం చక్కని ధారతో, నిర్దోషంగా నడిచింది. అభినందనలు.