Monday 28 June 2010

సమస్యాపూరణం

ఆర్యులారా!

క్రింది సమస్య దూరదర్శన్ లో 'సమస్యాపూరణం' కార్యక్రమంలో ఇవ్వబడింది.
అప్పట్లో నా పూరణ దూరదర్శన్ లో చదవడం జరిగింది . మీరు సరదాగా పూరించగలరు.

సమస్య: "కలలు గనెడి శిలలు పలుక గలవు"


7 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

కలలు కరగి పోవ కఠినాత్ములకు చిక్కి
చలన శక్తి పోయి చచ్చు పడిన
ఆడ పడచు సమితు లక్కటా! అయ్యవి
"కలలు గనెడి శిలలు పలుక గలవు"

జిగురు సత్యనారాయణ said...

తలలు లేని నరులు కలలను గనెదరు
కలలు గనెడి శిలలు పలుక గలవు
పలుక లేని వాడు పాడఁగలడు, చూడ
వినెడి వాడు పెద్ద వెఱ్ఱి వాడు!!

చింతా రామ కృష్ణా రావు. said...

మాష్టారూ! ఈ రోజు అనకాపల్లి విజయా రెసిడెన్సీ లో విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు సమావేశముంది. శ్రీ కేశాప్రగడ వారి ఉపన్యాసం ఉంది. తప్పక వెళ్ళండి.
అక్కడ మీ స్వీయ కవితాపఠనం కూడా చేసి సభికుల కానందం కలిగించండి.
ఏమంటారు? తప్పక వెళ్తారు కదూ? కోటారావు; వెంకటేశ్వరరావు వగైరా అందరి మిత్రులనూ నేనడిగినట్టు చెప్పండి.
చింతా రామ కృష్ణ రావు అని చెప్పండి.

సుమిత్ర said...
This comment has been removed by the author.
సుమిత్ర said...

జీవమున్న యట్టి శిల్పరూపములను
శిధిలపరచువారె శిలలు కదర
శిల్పహృదయశకల శిధిలాలు కదిలింప
కలలు గనెడి శిలలు పలుకగలవు.

ముస్లిం రాజుల దురహంకారానికి బలైపోయిన శిల్పసంపద, తాలిబన్లు కూల్చివేసిన అతి పెద్ద బుధ్ధ విగ్రహాల ప్రేరణతో ఈ పూరణ.

Unknown said...

సుమిత్రగారు, రెగ్యులర్‌గా మీ బ్లాగు చూస్తూంటాను.పూరణ భావం బాగుంది.

సుమిత్ర said...

రామకృష్ణారావుగారు,
పూరణ బాగుంది. ఇలాగే నిరంతరం మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తున్నాను.
ఇకపోతే పద్య కవితా సదస్సు 11వ తారిఖున.
కోటారావుగారిని అడిగినట్లు చెప్పాను.

సత్యనారాయణగారు,
అభినందనలు. మీ పూరణలన్నీ చాలా బాగుంటాయండి.