Friday 18 June 2010

సమస్యాపూరణం - ౩

స స్నేహితులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య....

ప్రాణములన్ తీయువాడు పరమాత్ము౦డౌ


4 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా!

" ప్రాణములన్ తీయువాఁడు పరమాత్ము౦డౌ "
అని సరిచేయగలరు.

చింతా రామ కృష్ణా రావు. said...

జ్ఞానముచే హీనులు. వి
జ్ఞానుల పరిమార్చు దుష్ట గర్విత పాళిన్
దీనుల గావగ పట్టుచు
ప్రాణములన్ తీయువాఁడు పరమాత్ము౦డౌ

కంది శంకరయ్య said...

క్షోణిం గల సాధుజన
త్రాణమ్మున కవతరించె దైవము; దైత్య
శ్రేణికి పతియగు రావణు
ప్రాణములన్ తీయువాఁడె పరమాత్ముండౌ.

సుమిత్ర said...

రామకృష్ణగారు, శంకరయ్యగారు,
మీ పూరణలు చాలాబాగున్నాయి. ఇన్నాళ్లు నేను నా పూరణ ఇచ్చాననుకొని ఊరుకున్నాను. ఆలస్యానికి క్ష౦తవ్యుడను. నా పూరణ ఇది.

ప్రాణము నిచ్చెడివాడును
ప్రాణుల కదలించువాడు పరమాత్ము౦డే.
ప్రాణుల లయమొ౦దించగ
ప్రాణములన్ తీయువాఁడు పరమాత్ము౦డౌ!