Friday 11 June 2010

సాహితీ మిత్రులారా!

ఈ బ్లాగును ప్రారంభించాలనే ఆలోచనకు ప్రేరణ శ్రీ కంది శంకరయ్యగారు.
ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.

ఇవి నేను చూచిన, విన్న "సమస్యల"కు నా స్వంత పూరణ లు.
ఆదరించి, ప్రోత్సహిస్తారని ఆశిస్తూ .....

- మీ "సుమిత్ర".

సమస్య: మందు త్రాగి పొందె మరణ మతఁడు

సందు గొందు వెలసె సారాయి కొట్లేన్నొ
పట్ణమందు ఆన్ని పల్లెలందు,
ఉండబట్టలేక ఉన్నదంతయు ఊడ్చి
మందు త్రాగి పొందె మరణమతడు


4 comments:

కంది శంకరయ్య said...

"సుమిత్ర" గారూ,
మీరు క్రొత్తగా ప్రారంభించిన "సమస్యాపూరణం" బ్లాగు నిరాటంకంగా కొనసాగాలని ఆకాం క్షిస్తున్నాను. మీరు పూరించిన పద్యాలే కాకుండా క్రొత్త సమస్యలను సృష్టించి బ్లాగులో పెట్టండి. నాలాంటివారికి అవకాశం ఇవ్వండి.

చింతా రామ కృష్ణా రావు. said...

సుమిత్రునకు అభినందనలు. నేను చోడవర నివాసినే.రిటైర్డ్ తెలుగు లెక్చరర్ నే. విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు సభ్యుఁడనే. బస్ కాంప్లెక్స్ కెదురుగా విజయా రెసిడెన్సీలో జరుపఁబడే సాహితీ సమావేశాలకు హాజరయేవాడిని.
ప్రస్తుతం అక్కడ నివాసం లేననుకోండి. మీరు కశింహోట వాస్తవ్యులని తెలిసిన తరువాత ఈ విషయాలు వ్రాయకుండా ఉండలేకపోయాను.
మీ ఆసక్తికి అభినందనలు.
మీరు శంకరాభరణంలో వ్రాసిన కందం చూచాను.

సుమిత్ర చెప్పారు...
నీతిగ బ్రతికెడు వైనము
జాతిని సేవించు భావజాలము లేకన్,
విత్తార్జన చింతన గల
చదువులు చెప్పించు కొలది చవటాయెనురా!

ప్రస్తుతం చదువులు ఎలా ఉన్నాయో చెప్తూ....

"నీతి నియమాలు, దేశభక్తి లేకుండా
కేవలం ధనార్జనే లక్ష్యంగా
చదువు చెప్పించిన కొద్దీ చవట అయ్యాడు" అని అర్థం.

@ శంకరయ్యగారు, రామకృష్ణారావు గారు, సత్యనారాయణ గారు
పూరణలు బాగున్నాయి. అభినందనలు.
14 జూన్ 2010 11:46 am
అని మీరు వ్రాసారు. మీ అభినందనలకు ధన్యవాదాలు.
మీరు వ్రాసిన కందంలో ప్రాసనియమం తప్పింది.
ప్రాస స్థానంలో ఉండే హల్లు ఏదైతే అదే కాని దానితో మైత్రిగల హల్లు కాని మిగిలిన అన్ని పాదాలలోను ఉండాలి.అది ఏక హల్లైనా ద్విత్వహల్లైనా; సంయుక్త హల్లైనా సరే అదే రావాలి.
మీకు చూచే ఆసక్తి ఉంటే
http://andhraamrutham.blogspot.com
తెరిచి చూడగలరు అందులో పద్య రచన అనే లేబుల్ క్లిక్ చేస్తే ఛందస్సు వగైరా వివరాలుంటాయి.

సుమిత్ర said...

@ చింతా రామకృష్ణ గారు,
మీ ఆత్మీయతా పూర్వక పలకరింపుకు ధన్యవాదములు. నా హృదయంలోని రూపాన్ని మీరు పిలిచినట్లే కొనసాగించవచ్చు అదే నేను కోరుకునేది కూడా. వీలుచూసి మిమ్ములను కలవగలను. నాకు తగిన సూచనలను ఇస్తున్నందుకు, సవరించుకునే అవకాశమిచ్చినందుకు క్రుతజ్నతలు. మిగిలిన నా సాహితీ ప్రక్రియలను పరిశీలించ గోర్తాను.

సుమిత్ర said...

@ కంది శంకరయ్య గారు,
మీరిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదములు.